ములుగు జిల్లా గోవిందరావుపేటలో టీఎస్ఎస్పీ అధికారులు చేపట్టిన తాత్కాలికి ఉద్యోగుల నియామకాల్ని నిరసిస్తూ భూ నిర్వాసితులు గ్రామంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. పోలీస్ బెటాలియన్‌కి కేటాయించిన ఆ భూముల్లో తాత్కాలిక నియమకాలు చేపట్టిన అధికారుల చర్యలను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక మహిళా రైతు ట్యాంక్‌పై నుంచి దూకడానికి ప్రయత్నించగా మిగిలిన రైతులు ఆమెను అడ్డుకున్నారు.
'మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి'
ములుగు జిల్లా గోవిందరావు పేట గ్రామంలోని పోలీస్ బెటాలియన్ భవన భూ నిర్వాసితులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరసనలు చేపట్టారు.
'మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి'
భూములు కోల్పోయిన తమ పిల్లలకే తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. లేని ఎడల ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే సీతక్క, ములుగు దేవేందర్ రెడ్డి, ఆర్డీఓ రమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి భూముల కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు, భూముల కింద భూములు ఇప్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు