ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి, సోమలగడ్డ రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఐకేపీ సెంటర్ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. కేంద్రానికి తీసుకొచ్చి ఇరవై రోజులు గడిచినప్పటికీ గోనె సంచులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్కు రైతుల ఫిర్యాదు - ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్కు రైతుల ఫిర్యాదు
ఐకేపీ సెంటర్కు ధాన్యాన్ని తెచ్చి 20 రోజులు గడిచినా గోనె సంచులు లేక అవస్థలు పడుతున్నామని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు అంతా కలిసి వినతి పత్రం అందజేశారు.
ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్కు రైతుల ఫిర్యాదు
రోజుల తరబడి ఉండటం వల్ల అకాల వర్షానికి ఎక్కడ తడిసిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రేపటికల్లా గోనె సంచులు అందేలా కృషి చేస్తానని రైతులకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!
TAGGED:
farmer problems