ములుగు జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడ్వాయి మండలం నార్లపూర్లో సోదాలు చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై 110 కిలోల నల్లబెల్లం తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. బెల్లం, వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్కు తరలించారు.
ములుగులో 110 కిలోల నల్లబెల్లం పట్టివేత - 110 కేజీల నల్లబెల్లం పట్టివేత
ములుగు జిల్లా నార్లపూర్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 110 కిలోల నల్ల బెల్లాన్ని ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
![ములుగులో 110 కిలోల నల్లబెల్లం పట్టివేత Excise Officers Seized 110 Kgs Black jaggery at narlapur in Mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7704057-21-7704057-1592685393116.jpg)
ములుగులో 110 కిలోల నల్లబెల్లం పట్టివేత
గోవిందరావుపేట మండలం పాపయ్యపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనంపై ఏడు లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. దీనివల్ల వాహనం నడుపుతున్న వ్యక్తి పారిపోవటం వల్ల వెనక కూర్చున్న మహిళలను అదుపులోకి తీసుకొని నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను స్టేషన్కు తరలించారు.