ములుగు జిల్లాలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 9 మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సి నారాయణ రెడ్డి పంపిణీ ప్రక్రియను సమీక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. మాక్ పోలింగ్‌లో తప్పిదాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఏడు గంటలకు ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.
ములుగు జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం - పోలింగ్ ఏర్పాట్లు
రాష్ట్రంలో ఓట్ల పండుగకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లాలో కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు దొర్లితే సెక్టోరియల్, ఏరియల్ ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల ఏర్పాట్లు