తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి'

మేడారం జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతరలో ఇప్పటికే 90 వేల మందికి వైద్య సేవలు, ఇద్దరికి ప్రసవాలు చేశామన్నారు.

Everyone Must Work Responsibly at medaram jatara mulugu
'ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి'

By

Published : Feb 7, 2020, 11:23 AM IST

మేడారం జాతరలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్య కేంద్రం, తాత్కాలిక వైద్య శిబిరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వైద్యం అందిస్తున్నామన్నారు.

50 పడకల ఆసుపత్రితో పాటు 40 తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు ఇప్పటికే 90 వేల మందికి వైద్య సేవలు అందించామని, మరో రెండు వేల మందిని ఆసుపత్రులకు తరలించామని వివరించారు. ఇద్దరికి ప్రసవాలు కూడా చేశామని, సుక్షితులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

'ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి'

ఇదీ చూడండి :శరీరంపై పెయింటింగ్​ వేసుకుని ప్రచారం

ABOUT THE AUTHOR

...view details