Medaram Jatara 2022: 'ట్రాన్స్కో సీఎండీతో చర్చించి.. సంస్థ సహకారంతో రూ.12 కోట్ల వ్యయంతో... కొత్తగా 132 కేవీ సబ్స్టేషన్.. పస్రాలో ఏర్పాటు చేస్తున్నాం. మూడున్నర కిలోమీటర్ల 11కేవీ లైను, 5 కి.మీ 6.3 కేవీ లైను, 71 కి.మీల ఎల్టీ లైను, ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్ దగ్గర ఇతర ప్రాంతాల్లోనూ త్వరలోనే ఈ లైన్లు వేయడం పూర్తవుతుంది. జాతర కోసం 200 విద్యుత్ నియంత్రికలను కొనుగోలు చేశాం. స్తంభాల ఏర్పాటు పనులూ వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 కల్లా అన్ని పనులూ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. చీకటన్నదే లేకుండా వెలుగులతో మేడారం పరిసరాలు ధగధగలాడేలా ఏర్పాట్లు చేస్తున్నాం.' - గోపాలరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ
Medaram Jatara 2022: వనదేవతల పండుగ.. మేడారం మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు
Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళగా పేరుపొందిన మేడారం మహా జాతర సమీపిస్తోంది. వనంలో ఉన్న దేవతలు జనంలోకివచ్చి నీరాజనాలు అందుకునే శుభ ముహూర్తం దగ్గరపడింది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జాతర జరగనుంది. ఇందుకు అన్ని శాఖలు సన్నద్ధమై... పనులు మొదలుపెట్టాయి. మేడారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ శాఖ వివిధ పనులు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు తెలిపారు. జనవరి 15 కల్లా పనులూ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నామంటున్న గోపాలరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
మేడారం జాతర 2022