ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లిలో అన్నను తమ్ముడు గొడ్డలితో నరికి హత్యచేశాడు. గ్రామానికి చెందిన సపక లక్ష్మణ్ అలియాస్ లచ్చులు(38) ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా, అతని తమ్ముడు సత్యనారాయణ గొడ్డలితో మెడపై నరికి చంపాడు.
భార్య, పిల్లలను కొట్టాడని అన్నను నరికి చంపిన తమ్ముడు - అన్నను చంపిన తమ్ముడు
తనతో గొడవపడి భార్యా పిల్లలను కొట్టాడనే కోపంతో ఓ తమ్ముడు అన్నను కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణం ములుగు జిల్లాలోని పూరేడుపల్లిలో చోటుచేసుకుంది.
అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు
పదిరోజుల క్రితం లక్ష్మణ్ తమ్ముడు సత్యనారాయణతో గొడవపడి తమ్ముడి భార్యాపిల్లలను చితకబాదాడు. ఆ గొడవలే లక్ష్మణ్ హత్యకు కారణమని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: చూస్తుండగానే కుప్పకూలాడు... రోడ్డు మీదే ప్రాణాలొదిలాడు..