కరోనా వైరస్ ఉద్ధృతం కావడంతో జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్‌డీవో రమాదేవి ఇంటింటికీ వెళ్లి పరిస్థితులపై ఆరా తీశారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఏరియా అస్పత్రికి తరలించారు.
కరోనాపై అప్రమత్తం.. ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు - కరోనాపై ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు
కొవిడ్ రోజురోజుకు విజృంభిస్తుండగా అధికారులు అప్రమత్తయ్యారు. ములుగు జిల్లాకేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ముందస్తుగా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
జిల్లా కేంద్రంలోని 16 వార్డుల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్లాలని సూచించారు. వైరస్ సోకినా మనో ధైర్యం కోల్పోవద్దని ఆర్‌డీవో రమాదేవి అన్నారు.
జ్వరము, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, వీఆర్‌వోలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్, సెక్రెటరీ పాల్గొన్నారు.