మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు వరంగల్ నగర పోలీస్ కమిషనర్, మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జీ రవీందర్ పలు సూచనలు చేశారు. మేడారం చేరుకునే క్రమంలో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ముందు వెళ్లే వాహనాలను ఎట్టి పరిస్థితిలో ఓవర్ టేక్ చేయోద్దని హెచ్చరించారు.
'ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయోద్దు' - mulugu district news today
తెలంగాణ కుంభమేళాగా పెరొందిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు వరంగల్ పోలీస్ కమిషనర్, మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జీ రవీందర్ పలు సూచనలు చేశారు. జాతరకు చేరుకునే క్రమంలో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని, ముందు వెళ్లే వాహనాలను ఎట్టి పరిస్థితిలో ఓవర్ టేక్ చేయోద్దని సూచించారు.
ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయోద్దు
మద్యం తాగి వాహనాలు నడిపవద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వరుస క్రమంలో తమ వాహనాలను నడపాలని స్పష్టం చేశారు. వనదేవతలను సంతోషంగా దర్శించుకుని తిరిగి క్షేమంగా పిల్లాపాపలతో ఇంటికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందేశాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఇదీ చూడండి :ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి