ములుగు జిల్లాలోని జాకారం గ్రామంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి. నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తూ గ్రామ ప్రజలను చైతన్య పరిచారు. గ్రామాభివృద్ధికి బాటలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక వేదిక కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రమదానంలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి - సి. నారాయణ రెడ్డి
ములుగు జిల్లా జాకారం గ్రామంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సి. నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
శ్రమదానంలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి