ములుగు జిల్లా వాజేడు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టలపైనున్న పెనుగోడు గ్రామానికి ఎమ్మెల్యే సీతక్క కాలిబాట పట్టారు. వాగులు వంకలు దాటుతూ సుమారు 20 కిలోమీటర్ల పైన కాలినడకన వెళ్లారు. గుమ్మడిదొడ్డి నుంచి పెనుగోడుకు నడుస్తూ గుట్టలపైనున్న గిరిజనులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు వెళ్లారు. నిత్యావసర సరకులు మోసుకుంటూ సీతక్క సహా కాంగ్రెస్ కార్యకర్తలు, సబ్ రిజిస్టర్ తస్లిమా, సరుకులు పంచేందుకు ఎమ్మెల్యే వెంట తరలివెళ్లారు.
20 కిలోమీటర్లు గుట్టల్లో నడిచి.. సరకులు పంచిన సీతక్క - గిరిపుత్రులకు సీతక్క ఆపన్నహస్తం
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర కిరాణా సరకులు అందిస్తున్నారు. ఎలాంటి వాహనం వెళ్లే దారిలేకుండా 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపైనున్న పెనుగోడు గ్రామానికి కాలినడకన వెళ్లి సరకులు పంపిణీ చేశారు.
గిరిపుత్రులకు సరుకులు పంచిన ఎమ్మెల్యే సీతక్క