Distribution of goods to flood victims : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన కుండపోత వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల, మల్యాల, కొండాయి గ్రామాలను తీవ్రంగా వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇళ్లు కొట్టుకుపోయి.. ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వీరి కష్టాలు చూసి చలించిన పలువురు మానవతావాదులు వీరికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.
Mulugu Floods 2023 : వరద ముంచెత్తింది.. కొండాయి గ్రామం గుండె పగిలింది
హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ.. గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల సహాకారంతో ఐటీడీఏ ఏటూరు నాగారం వద్ద 280 మందికి.. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బాధలో ఉన్న వారికి సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మరింత మంది సహాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Roads Damage in Mulugu District : భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు.. నిలిచి పోయిన రాకపోకలు
Mulugu Flood Victims : దేశంలోనే మొదటిసారి ఒక్కరోజులోనే అత్యధిక వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైందని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ తెలిపారు. ముంపు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వనున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ఇక్కడి ప్రజల దుస్థితిని చూసి సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా హర్షణీయమన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.