ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని సన్నబియ్యం, కూరగాయలు నిత్యావసర సరకులను బాలసాని ముత్తయ్య పంపిణీ చేశారు. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, స్థానిక జర్నలిస్టులకు కలిపి 820 కుటుంబాలకు అందించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా ఉపాధి లేక పస్తులుంటున్న నిరుపేదలకు, కూలీలకు సరకులు అందజేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ములుగులో కూలీలకు సన్న బియ్యం, కిరాణా సామాగ్రి పంపిణీ - ESSENTIAL GOODS MULUGU DISTRICT
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు సరకులు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివంటూ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కొనియాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. భౌతిక దూరాన్ని సైతం తప్పక పాటించాలని గ్రామస్తులకు తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే వారికి సామగ్రి పంపిణీ చేశామని ఎమ్మెల్సీ వెల్లడించారు.