కలెక్టర్ బొమ్మ గీసినందుకు రూ. పదివేల నజరానా - ములుగు గురుకుల పాఠశాలలో డిజిటల్ యాత్ర కార్యక్రమం
ములుగు జిల్లా బండారుపల్లి గురుకుల పాఠశాలలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు డిజిటల్ విజ్ఞానంపై మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్ విజ్ఞానంపై అవగాహన కల్పించడానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన డిజిటల్ యాత్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చందు అనే విద్యార్థి కలెక్టర్ చిత్రపటాన్ని గీసి ఇవ్వగా... అతనికి పదివేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని కలెక్టర్ అందజేశారు.
- ఇదీ చూడండి : సమాధులకు పూజలు.. ఆత్మలతో ముచ్చట్లు..!