తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో బొమ్మ దించేస్తున్నాడు..

మేడారం జాతర అనగానే 'బంగారం' గుర్తొస్తుంది.. కానీ..ఇప్పటి నుంచి తన బొమ్మ కూడా గుర్తొస్తుందంటున్నాడు ఓ కళాకారుడు. మేడారం సమ్మక్క సారలమ్మల జాతర వ్యాపారులకే కాదు కళాకారులకూ ఉపాధి కల్పిస్తోంది. 10 నిమిషాల్లోనే ఎదుటివ్యక్తి రూపాన్ని పెన్సిల్​తో కాన్వాస్​పై చిత్రీకరించి ఓ కళాకారుడు భక్తులను అబ్బురపరుస్తున్నాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

diagrams by artist in medaram in mulugu
మేడారంలో బొమ్మ దించేస్తున్నాడు..

By

Published : Feb 4, 2020, 2:51 PM IST

మేడారం జాతరకు కోట్ల మంది భక్తులు వస్తుంటారు. రెండోళ్లకోసారి వచ్చే జాతర కాబట్టి ఎంతో సంతోషంతో అమ్మవార్ల దర్శనానికి ఎక్కడకెక్కడినుంచో జనాలు తరలివస్తారు. వారిని నమ్ముకుని వేలాదిమంది చిరు వ్యాపారులు వారి పొట్టనింపుకుంటారు. జాతరలో బంగారం, కొబ్బరికాయలు, వివిధ రకాల పూజా సామాగ్రికే కాదండోయ్​ కళాకారులకు మంచి డిమాండ్ ఉంది. అయితే జాతరకి వచ్చే వారి బొమ్మలు గీస్తే బాగుంటుందనుకుని వంశీ అనే ఓ కళాకారుడు 10నిమిషాల్లో ఎదుటివ్యక్తి రూపాన్ని కాగితంపై దించేస్తున్నాడు.

బొమ్మను చూస్తూ మైమరచిపోతున్న భక్తులు

ములుగు జిల్లా పస్రాకు చెందిన వంశీ చిత్రకారుడు. 10 నిమిషాల్లో అందమైన చిత్రాలను గీస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాడు. యథాతథంగా భక్తుల చిత్రాలను గీసి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. మేడారం జాతర తనకు ఉపాధి చూపెడుతుందని ఆ చిత్రకారుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. చిత్రాలు బాగున్నాయని భక్తులు వంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మేడారంలో బొమ్మ దించేస్తున్నాడు..

ఇదీ చూడండి: వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..

ABOUT THE AUTHOR

...view details