ఏజెన్సీ జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా జిల్లాల్లో పోలీసులకు కావాల్సిన వసతుల కల్పన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా: డీజీపీ - Mahendar reddy tour in Mulugu district
ములుగు జిల్లా ప్రజల.. రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా: డీజీపీ
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేసిన ములుగు అధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పోలీసుల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల సమీక్షలో చర్చించినట్లు వెల్లడించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా: డీజీపీ
ఇదీ చూడండి : పాండవుల గుట్టల్లో కలెక్టర్ రాక్ క్లైంబింగ్
Last Updated : Mar 17, 2020, 7:00 AM IST
TAGGED:
DGP Mahendar reddy