తెలంగాణ

telangana

ETV Bharat / state

బండెనక బండి కట్టి... మేడారానికి బండి కట్టి... - సమ్మక్క సారక్క జాతర

బండెనక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి... ఏ బండ్లో పోతవ్​... మేడారం జాతరకు. అంటూ గిరిజన జాతరకు భక్తులు ఎడ్ల బళ్లపై వెళ్తున్నారు. ఒకప్పుడు ఇది ఆనవాయితీగా ఉండేది. అయితే ట్రాఫిక్​ సమస్యతో పాటు పశుగ్రాస కొరత తదితర సమస్యలతో ఎడ్లబళ్లపై జాతరకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. కొంత మంది మాత్రం ఇంకా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Bulluck
Bulluck

By

Published : Feb 5, 2020, 8:30 PM IST

గిరిజన జాతరకు ఎడ్ల బళ్లపై భక్తులు వెళ్లడం ఆనవాయితీగా ఉండేది. అందరూ వాహనాలతో వెళ్తున్నా.. కొంత మంది మాత్రం ఇంకా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

వరంగల్ నుంచి మేడారం వెళ్లే జాతీయ రహదారిలో అక్కడక్కడా భక్తులు ఎడ్లబళ్లపై వెళుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మేడారానికి ఎడ్లబళ్లపై భక్తులు వెళుతున్న తీరును ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.

బండెనక బండి కట్టి... మేడారానికి బండి కట్టి...

ఇదీ చూడండి:మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!

ABOUT THE AUTHOR

...view details