రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమ్మక్కసారలమ్మలను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలకు పసుపు కుంకుమ, చీరలు సమర్పించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి మనసారా మొక్కుకున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు.. మొక్కులు చెల్లింపులు - devotees rush at medaram jathara
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. అమ్మల సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం(బెల్లం), పసుపు కుంకుమ, పువ్వులు, ఒడి బియ్యం, కొబ్బరి కుడుకలు సమర్పించారు. శుక్రవారం కావడం వల్ల సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకునేందుకు గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మల గుడి గేట్లు మూసివేయడం వల్ల బయటి నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
-
ఇదీ చూడండి :మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ