ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నందున మేడారానికి భక్తుల రాక పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. జంపన్నకు పూజలు చేసి ముడుపులు కట్టారు.
మేడారంలో పెరుగుతున్న భక్తుల రద్దీ
సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. జంపన్నకు ముడుపులు కట్టి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
మేడారంలో పెరుగుతున్న భక్తుల రద్దీ
గద్దెల వద్దకు వచ్చి ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, పూలు, పండ్లు, పసుపు-కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: "వారిని కూడా చేరిస్తే 'ఎన్ఆర్సీ, ఎన్పీఆర్'కు మద్దతిస్తాం!"