తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు! - ప్రమాదకరంగా రామప్ప ఆలయ రహదారి

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలంలోని రామప్ప ఆలయానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. అయితే ఇటీవలే వేసిన మిషన్​భగీరథ పైపుల మీద నడుస్తూ భక్తులు ఆలయానికి వెళ్తున్నారు.

devotees problems to reach ramappa temple as road damaged
ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు!

By

Published : Sep 29, 2020, 5:04 PM IST

ములుగు జిల్లాలో ప్రఖ్యాత శిల్పాలు కొలువు తీరిన పర్యాటక కేంద్రం రామప్ప ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నెల రోజుల క్రితం చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

అయితే.. ఆ మార్గంలో మిషన్​ భగీరథ పైపులు ధ్వంసం కాగా.. అధికారులు ఇటీవలే కొత్త పైప్​లైన్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం చేరుకోవడానికి ఆ పైప్​లైనే ఆధారంగా మారింది. ప్రమాదమని తెలిసినా ఒకరిని చూసి మరొకరు పైప్​లైన్​పై నడుస్తూ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు.

ఇదీ చదవండిః6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​

ABOUT THE AUTHOR

...view details