ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఆదివారం సెలవు రోజు సందర్భంగా సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు పసుపు కుంకుమలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోరుకున్న కోరికలు తీర్చే తల్లీ అంటూ అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఆదివారం మేడారం జాతరకు పోటెత్తిన భక్త జనం - మేడారంలో భక్తుల తాజా వార్త
ఆదివారం సెలవు రోజు కావడం వల్ల ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు.
ఆదివారం రోజు మేడారంకు పోటెత్తిన భక్త జనం