ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ రోజు సెలవు దినం కావడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా కలిసి వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మలకు పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చు తల్లీ అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కుతున్నారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన వనదేవతలకు మొక్కితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సెలవు రోజున మేడారంకు పోటెత్తిన భక్తులు
ఆదివారం సెలవురోజు కావడం వల్ల ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు.
సెలవు రోజున మేడారంకు పోటెత్తిన భక్తులు