తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30 - మేడారం భక్తులకు ఫోన్​ ఛార్జింగ్​ కష్టాలు

మేడారం జాతరకు సర్వసిద్ధం చేసిన ప్రభుత్వం దూరప్రాంత భక్తుల కోసం ఛార్జింగ్​ పాయింట్ల ఏర్పాటును మరిచింది. ఇదే అదనుగా వ్యాపారులు ఒక్కో ఫోన్​ ఛార్జింగ్​ చేసేందుకు 20 నుంచి 30 రూపాయిలు వసూలు చేస్తున్నారు.

phone charging
మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30

By

Published : Feb 5, 2020, 11:07 PM IST

మేడారం జాతర కిక్కిరిసిపోయింది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులతో పూర్తిగా జనసంద్రమైంది. ప్రభుత్వం కూడా పటిష్ఠ ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసింది. వేల మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించింది. దూర ప్రాంతాల వారి బసచేసేందుకు గుడారాలను నిర్మించింది. కానీ చరవాణి ఛార్జింగ్​ చేసేందుకు మాత్రం సరైన సౌకర్యలు కల్పించలేదు.

ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు ఒక్కో చరవాణి ఛార్జింగ్​కు 20 నుంచి 30 రూపాయిలు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక భక్తులు వీరిని ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి ఛార్జింగ్​ పాయింట్లను ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.

మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30

ఇవీచూడండి:మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్​

ABOUT THE AUTHOR

...view details