crowd in medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఇటీవలే మేడారం మహాజాతర ముగిసింది. అయిప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వచ్చారు.
crowd in medaram: జాతర ముగిసినా మేడారంలో తగ్గని భక్తుల రద్దీ - భారీసంఖ్యలో భక్తులు
crowd in medaram: మేడారం మహాజాతర ముగిసినా భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది.
మేడారంలో భక్తుల రద్దీ
ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న భక్తులు పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, బంగారం (బెల్లం) నూతన వస్త్రాలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: