ప్రఖ్యాత శిల్పాలు కొలువుదీరిన పర్యాటక కేంద్రం, భక్తి ఆధ్యాత్మికత కలబోసిన రామప్ప ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్లాలంటే.. చిన్న, పెద్ద అందరూ అక్కడ ఫీట్లు చేయాల్సిందే. అదేంటి అనుకుంటున్నారా... అయితే కింది కథనాన్ని చదవండి.
రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నెల రోజుల క్రితం చెరువు మత్తడి ప్రవాహంతో కొట్టుకుపోయింది. దీంతో పాటు మిషన్ భగీరథ పైపులు ధ్వంసమైనా ఇటీవలే అధికారులు అక్కడ కొత్త పైపులు వేశారు. ప్రస్తుతం ఆలయం చేరుకోవడానికి ఆ పైపులైనే ఆధారంగా మారింది. ప్రమాదమని తెలిసినా ఒకరిని చూసి ఒకరు ఇలా చిన్న పిల్లలను పట్టుకుని పైపులైన్‌పై నడిచి వెళ్తున్నారు.
ఇవీ చూడండి:ఆ ఛాలెంజ్‌లకు దూరంగా ఉండండి..