ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనం కోసం లైన్లలో బారులు తీరారు.
జనసందోహంగా మేడారం చిన జాతర - sammakka saralamma festival
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం చిన జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సమ్మక్క సారలమ్మని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటున్నారు.
జనసందోహంగా మేడారం చిన జాతర
ఈ నెల 24 నుంచి జరుగుతున్న చిన్న జాతర ఈ రోజుతో ముగుస్తుండటంతో.. భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పసుపు కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు.
ఇదీ చదవండి:హీరో యశ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఇవే!