ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
సమ్మక్క సారలమ్మల సన్నిధికి పోటెత్తిన భక్తులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధికి పోటెత్తిన భక్తులు
జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల సన్నిధికి చేరుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం), పసుపు, కుంకుమ సమర్పించుకున్నారు. సమ్మక్క సారలమ్మల సన్నిధిలో శివసత్తుల కోలాహలం నెలకొంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి : మంత్రి కేటీఆర్