Devotees in Medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దేవాలయం ఒక్కసారిగా కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. తలనీలాలు సమర్పించుకుని అమ్మవారికి పూజలు చేశారు. వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరలు కట్టి నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
అమ్మవారి సేవలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే సీతక్క