తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో వసతి కేంద్రాల ఏర్పాటుపై భక్తుల హర్షం - medaram latest news

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి గృహాలను ఏర్పాటుచేశారు.

devotees are  happy with arrangements in medaram
మేడారంలో వసతి కేంద్రాల ఏర్పాటుపై భక్తుల హర్షం

By

Published : Feb 5, 2020, 11:52 PM IST

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గతంలో మేడారంకు వచ్చే భక్తులకు సరైన వసతి ఏర్పాట్లు లేక చెట్ల కింద, గుడారాలు నిర్మించుకుని అక్కడే నిద్రించేవారు. అటవీప్రాంతం కావడంతో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఐదు శాశ్వత వసతి కేంద్రాల నిర్మాణం చేసింది. అక్కడే స్నానాల గదులు, మరుగుదొడ్లను ఏర్పాటుచేసింది.

గతంలో, ఈ ఏడాదిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చిన తమకు వసతి పెద్ద సమస్యగా ఉండేదని.. ప్రభుత్వ చర్యలతో సమస్య పరిష్కారమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వసతి కేంద్రాల వద్దే తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటుచేశారు.

మేడారంలో వసతి కేంద్రాల ఏర్పాటుపై భక్తుల హర్షం

ఇవీచూడండి:మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్​

ABOUT THE AUTHOR

...view details