తెలంగాణ

telangana

ETV Bharat / state

తీగల వంతెనల రూపకర్తలు.. తండ్రీకొడుకులే సారథులు - లక్నవరం తీగల వంతెన రూపకర్తలు

లక్నవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన సరస్సు. అందులో వేలాడే వంతెనలు. ఇప్పటికే రెండు కనువిందు చేస్తుండగా, ముచ్చటగా మూడో వంతెన నిర్మాణం కూడా పూర్తయ్యింది. త్వరలో ప్రారంభం కానుంది. మొదటి రెండింటిని నిర్మించింది కర్ణాటకకు చెందిన ఇంజినీరు గిరీశ్‌ భరద్వాజ్‌ కాగా, మూడో వంతెనకు రూపమిచ్చింది ఆయన కొడుకు పతంజలి భరద్వాజ్‌. అందుకే వీటిని తండ్రీకొడుకుల వారధులు అంటున్నారు.

Designers of laknavaram rope bridge.. Father and son are the stewards
తీగల వంతెనల రూపకర్తలు.. తండ్రీకొడుకులే సారథులు

By

Published : Dec 18, 2020, 11:42 AM IST

గిరీశ్‌ భరద్వాజ్‌ తీగల వంతెనలు నిర్మించడంలో దేశంలోనే ప్రఖ్యాతి చెందారు. వందలాది మారుమూల గ్రామాలకు తక్కువ ఖర్చుతో వంతెనలు కడుతుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం గిరీశ్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. అతన్ని ‘భారత దేశ వంతెనల మనిషి’గా, ‘సేతు బంధు’గా పిలుస్తారు. ఇప్పటి వరకు 138 బ్రిడ్జిలు నిర్మించారు.

సరదాగా వెళ్లి..

లక్నవరంలో 2007లో మొదటి, 2018లో రెండో తీగల వంతెనకు రూపమిచ్చింది ఈయనే. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని తనయుడు పతంజలి భరద్వాజ్‌ అందిపుచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచే నాన్న వృత్తిపై ఆకర్షితులయ్యారు. తండ్రితో కలిసి సరదాగా వెళ్లి నిర్మాణాలను ఆసక్తిగా చూసేవారు. అలా అదే రంగంలో తాను కూడా స్థిరపడాలనుకొని మంగళూరులో ఎంటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కొన్నేళ్లపాటు ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వెళ్లారు. తిరిగి భారత్‌కు వచ్చి తండ్రితో కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి 20 వరకు వంతెనలు కట్టారు. లక్నవరం రెండో వంతెనకు పతంజలి స్వయంగా డిజైన్‌ చేశారు. మూడో వంతెన నిర్మాణం బాధ్యతలు పూర్తిగా ఆయనే చూశారు.

సొంతూరితో మొదలు

గిరీశ్‌ 1973లో కర్ణాటకలోని మాండ్యలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. వీళ్ల సొంతూరు దక్షిణ కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఉన్న సులియా. ఇది మారుమూల ప్రాంతం. రహదారి ఉండేది కాదు. పట్టణానికి రావాలంటే మధ్యలో పాయస్విని నది అడ్డుగా ప్రవహించేది. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు కూడా బంద్‌. అయితే గిరీశ్‌ చదివింది మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కావడంతో 1975లో సొంతంగా స్టీల్‌ ఫాబ్రికేషన్‌ పరిశ్రమ నెలకొల్పారు. వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ క్రమంలో గిరీశ్‌ వాళ్ల నాన్న ఊరి కోసం వంతెన నిర్మించాలని అడిగారు. దీంతో గిరీశ్‌ తన బుర్రకు పదునుపెట్టారు. చెట్ల కర్రలు, స్థానికంగా లభించే సామగ్రితో, ఊరి వాళ్ల భాగస్వామ్యంతో చక్కటి తీగల వంతెనను 1989లో నిర్మించారు. సులియా గ్రామానికి కష్టాలు తప్పాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని అభినందించారు. అలా తీగల వంతెనలను నిర్మించడం ప్రారంభించారు.

వారధులు.. ప్రేమ మనుషులు

తండ్రీ కొడుకులకు ఈ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. వరంగల్‌ వారు ప్రేమ మనుషులని గిరీశ్‌ ‘ఈనాడు’తో 2007 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు లక్నవరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనా స్థానికులు తనకు అండగా నిలిచారని, అప్పటి సర్పంచి యాదగిరిని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించినట్టే తన కొడుకు పతంజలిపై చూపుతున్నారని చెప్పారు.

ఇదీ చూడండి :లైవ్​ వీడియో: ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details