తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతర భక్తులకు ఎప్పటికి గుర్తుండాలి: సీఎస్​ - telangana CS latest news

రేపు మేడారం జాతర ప్రారంభంకానున్న సందర్భంగా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్​ కుమార్​ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల వినియోగం, బస్సుల ఏర్పాటు, పారిశుద్ధ్యం, పార్కింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ శాఖలు ప్రతిరోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలిని ఆదేశించారు.

CS teleconference about medaram jathara
CS teleconference about medaram jathara

By

Published : Feb 4, 2020, 2:09 PM IST

Updated : Feb 4, 2020, 3:53 PM IST

మేడారం జాతరకు వచ్చే భక్తుల మనసులో ఆ పర్యటన స్థిరస్థాయిగా నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ చెప్పారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని అధికారులను సోమేశ్ కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌ బీఆర్​కే భవన్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెరుగైన వసతులు కల్పించాలి

నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో మరుగుదొడ్ల వినియోగం, బస్సుల ఏర్పాటు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ లాట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. వివిధ శాఖలకు సంబంధించి ఇంటర్ సెక్టోరల్ టీమ్స్ ప్రతి రోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఏవైనా అవాంతరాలు ఎదురైన పక్షంలో తక్షణం సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకొని వాటిని వెంటనే సరిదిద్దాలన్నారు. ప్రతి శాఖ క్రియాశీలకంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని సీఎస్ ఆదేశించారు.

ట్రాఫిక్​, భద్రతపై ప్రత్యేక దృష్టి

యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టోల్ గేట్ల వద్ద నోడల్ అధికారులను నియమించి రద్దీ ఏర్పడకుండా అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారులపై మరమ్మతుల కోసం ప్రణాళికలు రూపొందించుకొని, సిబ్బందిని ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.

ఇదీ చూడండి:మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

Last Updated : Feb 4, 2020, 3:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details