ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరులో సీఆర్పీఎఫ్ అధికారులు మొక్కలు నాటారు. నేషనల్ ట్రీ ప్లాంటేషన్- 2020 సందర్భంగా 101 బెటాలియన్ కమాండెంట్ హరి ఓం కారే కార్యక్రమంలో హాజరయ్యారు.
'మొక్కలను కాపాడితే.. అవే మనల్ని సంరక్షిస్తాయి' - నేషనల్ ట్రీ ప్లాంటేషన్ డే తాజావార్తలు
ములుగు జిల్లాలో ట్రీ ప్లాంటేషన్ డేలో భాగంగా సీఆర్పీఎఫ్ అధికారులు మొక్కలు నాటారు. ఈరోజు నాటిన మొక్కలే రేపటి కాలానికి పర్యావరణ పరిరక్షణలో దోహదపడతాయని వెల్లడించారు.

నేటి మొక్కలే... రేపటి మహావృక్షాలు
ఈ రోజు నాటిన మొక్కలు రేపటి కాలంలో పర్యావరణ పరిరక్షణలో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గణేష్ కుమార్, సీఆర్పీఎఫ్ అధికారులు, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.