తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలొచ్చారు. ఉత్సవాలు ముగియడం వల్ల ఎక్కడ చూసినా చెత్తాచెదారమే కనిపిస్తోంది. దుర్గంధంతో కంపు కొడుతోంది. సరిహద్దులో తుపాకులతో శత్రువులను ఏరిపారేసే సైనికులు... ఇప్పుడు మేమున్నామంటూ ముందుకు వచ్చారు.
తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు
శత్రువులను తుపాకులతో ఏరిపారేసే జవాన్ల చేతుల్లో ఇప్పుడు చీపుర్లు ఉన్నాయి. అదేంటీ మన సైనికుల చేతుల్లో గన్స్ ఉండాలి కానీ... ఈ చీపుర్లు ఏంటీ అనుకుంటున్నారా... అయితే ఈ కథనం చదవాల్సిందే.
తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు
ఇన్నాళ్లు జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగం.. సీఆర్పీఎఫ్ జవానులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు. డీ/39 బెటాలియన్ సీఆర్పీఎఫ్, డీఎస్పీ యేసుదాస్, సీఐ లక్ష్మయ్య, ఎస్సై సుబ్బరాజు, అశోక్ మిగితా బృందం తదితరులు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేశారు. చీపుర్లు పట్టి చెత్తాచెదారం అంతా ఊడ్చిపారేశారు.
ఇదీ చూడండి:అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్తే.. రాళ్లతో దాడి
Last Updated : Feb 12, 2020, 5:48 PM IST