గత కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద రైతులకు పట్టా పాసు పుస్తకాలు వెంటనే అందించాలని, రైతుబంధు పథకాన్ని అందించి ఆదుకోవాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఇరు పార్టీలు ధర్నా చేపట్టారు. పోడు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.
పోడు రైతులకు 'రైతుబంధు' వర్తింపజేయాలి - రైతు బంధు
పోడు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి రైతు బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం పార్టీలు వేర్వేరుగా ఆందోళనకు దిగాయి.
cpi-and-cpm-leaders-demand-that-scarmbled-land-farmers-should-get-raithu-bandhu
Last Updated : Jul 23, 2019, 3:08 PM IST