తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ - telangana news today

మేడారం చినజాతరలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి అప్పయ్య పేర్కొన్నారు. మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. మేడారం చినజాతర నేటితో ముగియనుంది.

Corona positive for employees in Medaram jatara
మేడారంలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్​

By

Published : Feb 27, 2021, 6:44 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేపథ్యంలో.. విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయిందని జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు.

ఈ నెల 24న మొదలైన మేడారం చిన్నజాతర ఇవాళ్టితో ముగియనుంది. గత నాలుగు రోజులుగా ఉద్యోగులు ఇద్దరూ విధుల్లో ఉన్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలందించే క్రమంలో.. ఉద్యోగులిద్దరూ అస్వస్థకు గురైనట్లు అప్పయ్య చెప్పారు.

దీంతో వీరిద్దరికీ స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఉద్యోగులను హోమ్ క్వారంటైన్‌కు తరలించామని వైద్యాధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి :పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం

ABOUT THE AUTHOR

...view details