అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చి ఇబ్బందులకు గురికావొద్దని ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ఆలం అన్నారు. వెంకటాపురం మండలంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
'ప్రతి పౌరుడు.. ఖాకీ దుస్తులులేని పోలీసే' - police search in mulugu district
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమని ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ఆలం అన్నారు. ములుగు జిల్లా వెెంకటాపురం మండలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతమైనందున .. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిర్బంధ తనిఖీలు, ములుగు జిల్లా
అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే ప్రతి పౌరుడు ఖాకీ దుస్తులు లేని పోలీసు అని గౌస్ఆలం పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని చెప్పారు.