ములుగు జిల్లా కేంద్రంలో పోలీసులు ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఏఎస్పీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల శ్రేయస్సు కోసమే నిర్బంధ తనిఖీలు
ప్రజల శ్రేయస్సు కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు ములుగు ఏఎస్పీ సాయి చైతన్య తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరూ మాస్కులు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు.
ఇంటి యజమాని పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, ఇంట్లో కిరాయి ఉన్న వారి వివరాలు, ద్విచక్ర వాహనాలకు, కార్లకు లైసెన్స్లు వంటి సమాచారాన్ని సేకరించారు. ప్రజల భద్రత కోసమే ఈ నిర్బంధ తనిఖీలు చేస్తున్నట్లు ఏఎస్పీ సాయి చైతన్య తెలిపారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయమిచ్చి ఇబ్బందులకు గురికావద్దంటూ హెచ్చరించారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండాలని... మాస్కులు తప్పని సరి ధరించాలని సూచించారు. ఏఎస్పీ సాయి చైతన్య, ములుగు ఎస్సై హరికృష్ణ, వెంకటాపూర్ ఎస్సై రమేష్తో సహా 100 మంది సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ మృతి