ములుగు జిల్లా కేంద్రంలో.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Petrol prices: 'పెరిగిన ధరలతో బతుకు భారమైంది' - కాంగ్రెస్ శ్రేణుల నిరసన
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.
congress protest
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రూ. 45 ఉన్న పెట్రోల్ ధర.. నేడు రూ.100కు చేరిందని కుమారస్వామి ప్రస్తావించారు. పెరిగిన ఇంధన, నిత్యావసరాల ధరలతో పేదల బతుకు భారమైందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్