ములుగులో ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: సీతక్క - భారత్ బంద్ తాజా వార్తలు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. భారత్ బంద్‌లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
![వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: సీతక్క congress mla seethakka protest in mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9805465-thumbnail-3x2-seethakka.jpg)
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: సీతక్క
ఈ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు