ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరుతూ... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ధర్నా నిర్వహించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క ధర్నా - Latest news in Telangana
ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్క ధర్నా చేపట్టారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే సీతక్క ధర్నా
రాష్ట్రంలో గంటగంటకు మరణాల రేటు పెరుగుతున్న ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక... ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. కరోనా మహమ్మారిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'కబ్జాలకు పాల్పడ్డ మంత్రులందరిపై విచారణ చేపట్టాలి '