నిజాయితీ చాటుకున్న కండక్టర్ - conductor
పోయిందనుకున్న సొమ్ము దొరికింది. బస్సులో మరిచిపోయిన పర్సును కండక్టర్ బాధితురాలికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఘటన ములుగులో జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేంద్ర చారి.. బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లడానికి సిద్ధమై హన్మకొండ బస్టాండ్‌లో తుపాకుల గూడెం బస్సు ఎక్కి ములుగు బస్టాండ్‌లో దిగారు. నాగేంద్ర చారి భార్య బస్సులో పర్సు మరిచిపోయింది. వెంటనే ములుగు బస్టాండ్‌లో ఉన్న కంట్రోలర్ యాకయ్యను సంప్రదించగా తుపాకులగూడెం బస్సు డ్రైవర్, కండక్టర్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. ఆమె కూర్చున్న సీట్లో పర్సు మరిచిపోయిందని చెప్పడంతో... కండక్టర్ బస్సు పరిశీలించి పర్సును స్వాధీనం చేసుకున్నాడు. తుపాకుల గూడెం గ్రామానికి తిరుగు ప్రయాణమైన బస్సు కండక్టర్ ములుగు బస్టాండ్‌లో ఉన్న కాంట్రోల్ యాకయ్య చేతుల మీదుగా కండక్టర్ రాజయ్య బాధితురాలికి పర్సు అందించారు. పర్సులో 5 తులాల వెండి, చరవాణి, రూ. 500 నగదు ఉన్నాయని తెలిపింది.