ములుగు జిల్లా తాడ్వాయి మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయాల మరమ్మతు పనులు పరిశీలించారు. తహసీల్దార్ చాంబర్, వీసీ గది, రికార్డు రూమ్, టాయిలెట్స్ పరిశీలించారు. మరమ్మతులతో కార్యాలయాలకు కొత్త కళ వచ్చినట్లు.. పరిశుభ్రతను పాటిస్తూ, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు.
ఈ-ఆఫీస్ చేపట్టాలని, ఇందుకై ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఎంపీడీవో కార్యాలయ మరమ్మతు పనులు పరిశీలించారు. పన్నుల వసూలు 42 శాతం మాత్రమే ఉందని ప్రత్యేక దృష్టి పెట్టి వంద శాతం పూర్తి చేయాలన్నారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.