తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి' - mulugu latest news

సమ్మక్క బ్యారేజీ, సీతారామా ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని... సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను ఈఎన్‌సీ మురళీధరరావుతో కలిసి ఆమె పరిశీలించారు.

CMO secretary Smitha sabarwal inspects Sammakka barrage
సమ్మక్క బ్యారేజీ పనులు పరిశీలించిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​సమ్మక్క సాగర్​ బ్యారేజీ పనులు పరిశీలించిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​

By

Published : May 12, 2021, 7:37 AM IST

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క సాగరం బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని... సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. ఈఎన్‌సీ మురళీధరరావుతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో తుపాకులగూడెం చేరుకున్నారు. తొలుత బ్యారేజీ వద్ద ఏరియల్‌ సర్వే చేశారు. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్​ వచ్చే అవకాశాలు ఉండడంతో పనులు సత్వరం పూర్తి చేయాలని ఆమె సూచించారు.

వచ్చే సీజను వరకల్లా పూర్తిచేయాలి...

వచ్చే సీజను వరకల్లా సీతారామా ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి కాలరీస్‌ గెస్ట్‌హౌస్‌లో జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారు సంస్థలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా కాంక్రీటు పనులను ప్రారంభించాలన్నారు. కొవిడ్‌తో పనులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. వచ్చే జూన్‌ వరకల్లా ప్రధాన కాలువపై సత్తుపల్లి ట్రంక్‌ వరకు ఉన్న పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details