ములుగు జిల్లాలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ములుగు జిల్లా తుపాకులగూడెం ప్రాజెక్టును స్మితా సబర్వాల్ సందర్శించారు. బండపల్లి వద్ద గల దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ ఇంటర్నల్ పనులను ఆమె పరిశీలించారు. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు జరుగుతున్న సొరంగం మూడో దశ పనులు పోస్టల్ పంపిణీ పనుల్లో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల సొరంగ పనుల డిజైనింగ్, పనులకు పట్టే సమయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్ - CMO Secretary Smita Sabarwal visited tupakulagudem project
తుపాకులగూడెం ప్రాజెక్టును సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. ములుగు మండలం బండపల్లిలోని దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ మూడు ఇంటర్నల్ పనులను పరిశీలించారు.
![ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5146134-thumbnail-3x2-smitha-rk.jpg)
ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మిత సబర్వాల్
ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్
ఇదీ చూడండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం