తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి - medaram jathara latest news

మేడారం జాతర దిగ్విజయంగా జరిగిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం అభినందించారు.

cm-kcr-satisfy-with-medaram-jathara-organizing
మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి

By

Published : Feb 8, 2020, 10:15 PM IST

నాలుగు రోజులపాటు వైభవంగా సాగిన... మేడారం జాతర ముగిసింది. సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో.... తెలంగాణ కుంభమేళ పరిసమాప్తమైంది. మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను అభినందించారు.

అన్ని శాఖల సమన్వయం వల్లే జాతర దిగ్విజయంగా జరిగిందని సీఎం పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూశారని ప్రశంసించారు.

ఇదీ చూడండి:మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

ABOUT THE AUTHOR

...view details