తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు - మేడారం తాజా వార్త

ములుగు జిల్లా మేడారం జాతరలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్​ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మేడారంలోనే వేగంగా పనులు చేయిస్తున్నారు. జాతర ప్రాంతానికి 15కిలో మీటర్ల ప్రాంతమంతటిలో పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు.

cleaning program in medaram
మేడారంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు

By

Published : Feb 11, 2020, 12:54 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. జాతర ముగింపు రోజు కురిసిన భారీ వర్షానికి మేడారంలో అక్కడి ప్రాంతమంతా బురదమయం అవ్వడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకుపోవడం జరిగింది. మేడారాన్ని స్వచ్ఛ మేడారం చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

మహా జాతర ముగిసిన తర్వాత దాదాపు 15 కిలోమీటర్ల వెలుపల కూడా వ్యర్థాలతో నిండిపోయింది. చెత్తాచెదారం తొలగించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మేడారం జాతరలో 15 సెక్టార్ల అధికారులు ఇక్కడే ఉండి పారిశుద్ధ్యం పనులు పూర్తిచేయాలని ఆయన సూచించారు.

జాతర పరిసరాల్లో ఏకకాలంలో రెండు వేల మంది కూలీలతో చెత్తాచెదారం వివిధ రకాల వ్యర్థాలను ట్రాక్టర్లలో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దుర్గంధం వ్యాపించకుండా నీటి నిలువ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. పారిశుద్ధ్య నియంత్రణ కోసం 12 జేసీబీలు, 40 ట్రాక్టర్లు, ఆరు డోజర్లు వినియోగిస్తున్నారు.

డీపీవోలు ఇద్దరు, మండల పంచాయతీ అధికారులు తొమ్మిది మంది, పంచాయతీ సెక్రటరీలు 60 మంది, బిల్ కలెక్టర్లు కారోబార్లు 40 మంది దగ్గరుండి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. జాతర పరిసరాల్లో పేరుకుపోయిన మాంసం వ్యర్థాలను అక్కడికక్కడే పూడ్చి వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను అధికారులు కొనసాగిస్తున్నారు.

మేడారంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు

ఇదీ చూడండి: మినీ పట్టణాల ఏర్పాటుకు హెచ్​ఎండీఏ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details