తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, బీజాపూర్ జిల్లా తాళ్ల గూడెం మధ్య గల అడవి ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు(maoist killed in telangana) పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో ప్రస్తుతానికి ఇద్దరిని గుర్తించినట్లు వెల్లడించారు. ఎదురు కాల్పుల ఘటనను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ధ్రువీకరించారు.
maoist killed in telangana: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
09:55 October 25
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
ఘటనా స్థలం నుంచి 3 మృతదేహలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తప్పించుకున్న వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
మృతిచెందిన మావోయిస్టుల వివరాలు
ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు వెట్టి ఐత అలియాస్ ఐతడు, మూచకి ఉంగల్గా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఐత ఈ ఘటనలో మృతిచెందినట్లు తెలిపారు. రఘు బీజాపూర్ జిల్లా భైరంగడ్ మండలం కొర్రవాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
ముమ్మరం
అగ్రనేత ఆర్కే మరణం తర్వాత తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సంయుక్త బలగాలు కూంబింగ్ ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా... మరో వ్యక్తి ఎవరు అనేది సమాచారం లేదు.
ఇదీ చదవండి:Intermediate First Year Exams Started: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం