లాక్డౌన్ కష్టకాలంలో ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకునేందుకు మానవతావాదులంతా ముందుకు రావాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా కోరారు. స్థానిక సర్వర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. గోవిందరావుపేట మండలానికి చెందిన 60మంది కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
పేదలకు అండగా నిలస్తోన్న స్వచ్ఛంద సంస్థలు - కొవిడ్ బాధితులకు ధైర్యం
కొవిడ్ బాధితులంతా ధైర్యంగా ఉంటూ మహమ్మారిని ఎదుర్కొవాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సూచించారు. ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలానికి చెందిన కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రజలంతా కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
humanists in lockdown
కొవిడ్ బాధితులంతా ధైర్యంగా ఉంటూ మహమ్మారిని ఎదుర్కొవాలని తస్లీమా కోరారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తే కరోనా దరి చేరదని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్