గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందముంది: అర్జున్ ముండా - samakka ralamma jathara 2020
09:43 February 08
మేడారం జాతరను దర్శించుకున్న కేంద్రమంత్రి అర్జున్ ముండా
సమ్మక్కను దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి అర్జున్ ముండా తెలిపారు. జాతరకు కోట్లమంది భక్తులు వస్తున్నందున జాతీయ గిరిజన పండగ కల సాకారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. జాతీయ పండగ హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అర్జున్ ముండా తెలిపారు. త్వరలోనే ఆదివాసీల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందం ఉందని పేర్కొన్నారు. జాతీయ పండగ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినట్లు తెలిపారు.
ఇప్పటివరకు మేడారానికి 3 వేల బస్సు సర్వీసులు నడిపినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. 12 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి:ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం