తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరప కల్లం.. నిఘా నేత్రం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాతమరికాలకు చెందిన రైతు శ్యామల రాంబాబు 18 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే పంటను ఎండబెట్టేందుకు గోదావరి నది తీరంలో ఇసుక దిబ్బలపై కల్లం ఏర్పాటు చేసి ఆరబోస్తున్నారు.

By

Published : Feb 17, 2021, 7:54 AM IST

మిరప కల్లం.. నిఘా నేత్రం
మిరప కల్లం.. నిఘా నేత్రం

ఎండు మిర్చి పంటను కోశాక రోజుల తరబడి బాగా ఎండబెట్టాలి. ఇందుకోసం రైతులు పొలాల్లో లేక ఖాళీ స్థలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకుని ఆరబెడతారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాతమరికాలకు చెందిన రైతు శ్యామల రాంబాబు 18 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే పంటను ఎండబెట్టేందుకు గోదావరి నది తీరంలో ఇసుక దిబ్బలపై కల్లం ఏర్పాటు చేసి ఆరబోస్తున్నారు.

మూడు దఫాలుగా వచ్చే పంటను మొత్తంగా రెండు నెలల పాటు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిరంతర కాపలాకు రూ.40 వేల ఖర్చుతో 6 సీసీ కెమెరాలు, ఇన్వర్టర్‌ బ్యాటరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎండు మిర్చి క్వింటా ధర ప్రస్తుతం రూ.12 వేల వరకూ ఉంది.

ఇదీ చదవండి:జోరందుకున్న 'మండలి' సన్నాహక సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details